విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటనపై కేఏ పాల్ ఫైర్ (వీడియో)

0చూసినవారు
AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో పార్టీ పెట్టనున్నట్లు చేసిన ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. జగన్ గెలిచి ఉంటే విజయసాయిరెడ్డి పార్టీ పెట్టేవారా? అని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే మత మార్పిడి, అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఓట్లు చీల్చేందుకు, దోచుకున్నది దాచుకునేందుకే విజయసాయిరెడ్డి పార్టీ పెడుతున్నారని ఆరోపించారు. అవినీతి పార్టీని భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్