
AP: పులిని చంపి గోళ్లు తీసుకున్న వేటగాళ్లు
ఏపీలోని నల్లమల అడవుల్లో రెండు పులులు మరణించడంపై హైపవర్ కమిటీ ఛైర్మన్ మల్లికార్జునరావు వివరణ ఇచ్చారు. గిద్దలూరు అటవీప్రాంతంలో వేటగాళ్లు ఒక పులిని తుపాకీతో కాల్చి చంపి, దాని గోళ్లు తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆత్మకూరు రీజియన్లో మరో పులి ముళ్లపందిని తినేందుకు ప్రయత్నించి చనిపోయిందని ఆయన పేర్కొన్నారు.




































