AP: కడప స్టీల్ ప్లాంట్‌ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన అన్ని అనుమతులు
వైసీపీ హయాంలోనే పూర్తి చేశామన్నారు. జేఎస్ఈకి బాధ్యతలు అప్పగించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిందాల్ సంస్థపై కక్ష సాధింపు చర్యలతో ప్రాజెక్టు రెండేళ్లు ఆలస్యమైందని ఆరోపించారు.