గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ పాట డిజిటల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాటలోని హుక్ స్టెప్, జాన్వీ కపూర్ గ్లామర్‌తో పాటు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా స్టెప్పులేస్తున్నారు. తాజాగా, కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు పంతగాని నరసింహ ప్రసాద్ వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. దర్శకుడు బుచ్చిబాబు ఈ వీడియోను రీట్వీట్ చేయడంతో ఈ పాట మరింత ప్రాచుర్యం పొందింది.