
బద్వేల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ఆదివారం కడప-చెన్నై జాతీయ రహదారి వాసవి కాలేజ్ సమీపాన రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గడివారి పల్లె గ్రామానికి చెందిన పిచ్చయ్య ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, హైదరాబాదు నుంచి తిరుమలకు వెళ్తున్న కారు ఆయన వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పిచ్చయ్య భుజానికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆయనను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.








































