కాశినాయన మండలం, ఇటుకలపాడు పంచాయతీ కొట్టాలపల్లి గ్రామంలో బుధవారం సుమారు 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. బద్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రితేష్ రెడ్డి ప్రజల సమస్యలపై స్పందిస్తున్న తీరుకు ఆకర్షితులై ఈ చేరికలు జరిగినట్లు సమాచారం. ఇది వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.