బద్వేల్: కూలిన బ్రహ్మం స్వామి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్

9చూసినవారు
భారీ వర్షాల కారణంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పురాతన గృహం కూలిపోవడంతో, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బుధవారం రాత్రి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు, మఠం నిర్వాహకులు, బ్రహ్మంగారి గృహ సంరక్షకులతో ఆయన మాట్లాడి, గృహం కూలిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 1978-79 మధ్య కాలంలో మట్టి, పలకరాయి, చెక్క స్తంభాలతో నిర్మించిన ఈ గృహం, ప్రస్తుత వర్షాల ధాటికి తట్టుకోలేక కూలిపోయిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్