శ్రీహరికోటలో నవంబరు 2న జరగనున్న శాటిలైట్ లాంచింగ్ను వీక్షించేందుకు బద్వేలు, పోరుమామిళ్ల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డీఎం చైతన్య నిరంజన్ తెలిపారు. పోరుమామిళ్ల నుంచి రూ. 1000, బద్వేలు నుంచి రూ. 800 ఛార్జీతో బస్సులు నవంబర్ 2న ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతాయి. ఈ సందర్భంగా చెంగాలమ్మ ఆలయం, నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం, పులికాట్ సరస్సులను కూడా సందర్శించే అవకాశం కల్పించారు.