బద్వేల్: దోబీ ఘాట్ స్థలాన్ని రజకులకే కేటాయించాలి: సిపిఐ

7చూసినవారు
బద్వేల్ మున్సిపాలిటీలోని గోపవరం మండలం శివాలయం వద్ద ఉన్న దోబీ ఘాట్ స్థలాన్ని రజకులకే కేటాయించాలని సీపీఐ నాయకులు ఆదివారం డిమాండ్ చేశారు. 2002లో కేటాయించిన ఈ స్థలం ద్వారా 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, ప్రస్తుతం ఆ స్థలాన్ని వాటర్ ప్యూరిఫైడ్ కోసం ఉపయోగించడం అన్యాయమని వారు వాపోయారు. దోబీస్థలం విషయంలో న్యాయం చేయాలని, అధికారులు స్పందించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్