సిద్దవటం జడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని శ్రీ విద్య, ఘట్కా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె ప్రతిభ కనబరచడంతో, పంజాబ్లోని లూథియానాలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, పీడీ చంద్రావతి సోమవారం సాయంత్రం తెలిపారు. ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.