బద్వేలులో అర్ధరాత్రి బస్సు బోల్తా: 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు

2979చూసినవారు
బద్వేలులో అర్ధరాత్రి బస్సు బోల్తా: 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు
బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని 108 అంబులెన్స్ ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్