ప్రేమ జంట ఆత్మహత్య: విషం తాగి, ఉరివేసుకున్న వైనం

148చూసినవారు
ప్రేమ జంట ఆత్మహత్య: విషం తాగి, ఉరివేసుకున్న వైనం
తిరుపతి జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. రాపూరు–చిట్వేల్ ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద ఆలపాక ప్రసన్న (25), యాకసిరి సావిత్రి (24) మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారి ఈ దారుణానికి దారితీసిందని ప్రాథమిక సమాచారం. సావిత్రికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఘటనాస్థలంలో పురుగుల మందు డబ్బాలు లభించడంతో ముందుగా విషం తాగి, అనంతరం ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్