మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తన.. చెప్పులతో దేహశుద్ధి

6చూసినవారు
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లిలో కడప జిల్లాకు చెందిన ఇద్దరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతుకు అక్కడి మహిళలే బుద్ధి చెప్పారు. బద్వేలు నుంచి నాగారపమ్మ గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆదురుపల్లి బస్టాండ్ వద్ద దిగిన మహిళలతో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆగ్రహించిన మహిళలు అతడిని వెంబడించి చెప్పులతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్