బద్వేల్ సమీపంలో జయన్నపై దాడి: తలకు గాయం, 5 కుట్లు

1431చూసినవారు
వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట పంచాయతీ బాలాజీ నగర్ కు చెందిన కే. జయన్న, బద్వేల్ పట్టణంలో సప్లయర్స్ షాప్ లో పని ముగించుకుని తన సొంత గ్రామానికి వెళుతుండగా, గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో జయన్న తలకు బలమైన గాయం కావడంతో, అతన్ని 108 వాహనం ద్వారా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి, చికిత్స అందించి, తలకు 5 కుట్లు వేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్