పోరుమామిళ్ల: ఏడాది పొడవునా నీటిలోనే..

5చూసినవారు
పోరుమామిళ్ల: ఏడాది పొడవునా నీటిలోనే..
పోరుమామిళ్ల మండలం చిన్నయరసాల పంచాయతీలోని టూకూరిపేట సమీపంలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ప్రత్యేకతను సంతరించుకుంది. నేలపై శయనించిన భంగిమలో ఉన్న ఈ విగ్రహం ఏడాది పొడవునా నీటిలోనే ఉంటుంది. 1930 ప్రాంతంలో కొందరు రైతులు కొండపైకి వెళ్తుండగా, రాళ్లపై నుంచి జారిపడటంతో, ఆ రాళ్లను తొలగించేందుకు తవ్వకాలు చేపట్టగా ఒకే రాతిపై మలిచిన అనంతపద్మనాభుడి విగ్రహం బయల్పడింది. విగ్రహాన్ని వెలికితీయడంలో విఫలమవడంతో అక్కడే గుడి నిర్మించారు. ఇది చెరువు ప్రాంతం కావడంతో ఆలయం చుట్టూ నీరు ఉంటుంది. ఏటా వైకుంఠ ఏకాదశికి భక్తులు వచ్చి, మోటార్లతో నీటిని తోడి పూజలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్