బద్వేల్ పట్టణంలో వరుస చోరీలు ప్రజలను కలవరపెడుతున్నాయి. శివరామకృష్ణ నగర్‌లోని ఒక ఇంట్లో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయి. మరో సంఘటనలో, ఎంసీ ఫర్నిచర్ షాప్‌లో తాళాలు పగలగొట్టి, వస్తువులను చెల్లాచెదురు చేసి, సీసీ కెమెరాల డీవీఆర్‌ను అపహరించారు. సీఈఏటీ ఏజెన్సీ షాప్‌లో సుమారు రూ.60 వేల నగదుతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.