
వేప చెట్టుకి పాలు
జమ్మలమడుగు పట్టణంలోని ముద్దనూరు రోడ్డు సాయిబాబా గుడి దగ్గర పాత నర్సింగ్ క్వార్టర్స్‌లో ఉన్న వేప చెట్టు నుంచి పాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ దృశ్యాన్ని చూడటానికి జమ్మలమడుగు చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దాదాపు రెండు రోజుల క్రితం నుంచి ఈ సంఘటన జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాలు నిజమవుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు.




































