ఎర్రగుంట్ల: ఆకట్టుకున్న ఓపెన్ హౌస్

18చూసినవారు
ఎర్రగుంట్ల: ఆకట్టుకున్న ఓపెన్ హౌస్
ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్లో గురువారం పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోలీసులు తమ విధుల్లో ఉపయోగించే ఆయుధాలు, తుపాకులు, రక్షణ పరికరాలపై అవగాహన కల్పించారు. పోలీసుల పనితీరు, ట్రాఫిక్ నియమాలు, సీసీటీవీ నిఘా వంటి అంశాలపై కూడా వారికి వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థులను ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్