జమ్మలమడుగులోని కోవెలకుంట్ల రోడ్డు పక్కన ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర స్థాయి తాళాల భజన పోటీ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.15 వేలు సహా మొత్తం 8 బహుమతులు ఉంటాయి. పాల్గొనేవారు ఆదివారం సాయంత్రం 7 గంటల లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.