బుధవారం కొండాపురం మండలం లావనూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆదినారాయణ ఇంటి సమీపంలో కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే నిపుణుడు మధుసూదన్ రెడ్డికి సమాచారం అందించగా, ఆయన చాకచక్యంగా కొండ చిలువను పట్టుకున్నారు. అనంతరం, అటవీ అధికారులకు సమాచారం అందించి, ఆ కొండ చిలువను అడవిలో వదిలిపెట్టినట్లు తెలిపారు.