మైలవరం మండలం కర్మలవారి పల్లె దేవర నుంచి తిరిగి వస్తున్న దొమ్మర నంద్యాలకు చెందిన పాలూరు రంగన్న (68) సోమవారం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. రంగన్న ట్రాక్టర్ ఎక్కే సమయంలో డ్రైవర్ వాహనాన్ని ముందుకు నడపడంతో కిందపడి తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు SI శ్యామ్ సుందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.