జమ్మలమడుగు పట్టణంలో భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. రహదారులు, వీధుల్లో పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి, వైర్లు తెగిపోవడంతో పట్టణమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు రోడ్లపై పడటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరిస్థితిని సమీక్షించి, మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.