ముద్దనూరు మండల పరిధిలోని చిన్న దుద్యాల, నల్లబల్లె గ్రామాల్లోని గంగమ్మ ఆలయాల్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చిన్నదుద్యాల ఆలయం తాళాలు పగలగొట్టి సుమారు లక్ష రూపాయల విలువైన వెండి కిరీటాన్ని దొంగిలించారు. నల్లబల్లెలోని ఆలయంలో కూడా తాళాలు ధ్వంసం చేసినట్లు అర్చకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.