వ్యవసాయ సిబ్బందికి శిక్షణ

6చూసినవారు
వ్యవసాయ సిబ్బందికి శిక్షణ
ముద్దనూరు మండలం బొందలకుంట రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయం, ఎలినినో ప్రభావంపై రెండవ రోజు శిక్షణ ఇవ్వబడింది. మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సహజ పద్ధతులను అనుసరించాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పీఎండీఎస్, మల్చింగ్, జీవామృతం, నీమాస్త్రం వంటి విధానాలపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్