సామాజిక భద్రతలో భాగంగా శనివారం జిల్లాలో 2,40,635 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసి 93.90 శాతం ప్రగతిని సాధించారు. మొత్తం 2,56,260 మందికి పింఛన్లు మంజూరు కాగా, రూ.111.51 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో 2,40,635 మందికి రూ.104.33 కోట్ల పింఛన్లు పంపిణీ చేశారు. పులివెందుల మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో, కలసపాడు మండలం చివరి స్థానంలో నిలిచాయి.