గండికోటలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా, ఆర్టీసీ 39 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి. ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు. పర్యాటకులు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.