మెగా డీఎస్సీ
నోటిఫికేషన్ పై సమగ్ర విచారణ జరపాలని వైయస్సార్ విద్యార్థి విభాగం కమలాపురం అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలో ఆయన మాట్లాడుతూ, 16,347 నియామకాల్లో పారదర్శకత లేదని, టాప్ ర్యాంకర్ల పేర్లు మెరిట్ లిస్టులో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని అన్నారు.
జగన్ హయాంలో సచివాలయ పోస్టులను నిష్పక్షపాతంగా భర్తీ చేశారని, ఈ లోపాలపై విచారణ జరపాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.