వేసవి సెలవులు ప్రకటించినా ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కళాశాలలు ఇష్టారాజ్యంగా తరగతులు నిర్వహిస్తున్నాయని ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వంశీ మండిపడ్డారు. ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి పెంచుతూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఆర్ఐఓ నోటీసులు ఇచ్చినా కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలో తరగతులు జరపడం దారుణమని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.