కడప ఐటీఐ సర్కిల్ వద్ద ఎస్.ఐ. మోహన్ కుమార్ గౌడ్ ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో బుధవారం ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినా, రాంగ్ రూట్‌లో వెళ్లినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.