బీఎడ్ కళాశాలల అక్రమాలపై ఏఐబిఎస్యు ఆగ్రహం

2012చూసినవారు
బీఎడ్ కళాశాలల అక్రమాలపై ఏఐబిఎస్యు ఆగ్రహం
కడపలో ఏఐబిఎస్యు సమావేశంలో బీఎడ్ కళాశాలల అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో నిబంధనలు పాటించకుండా కళాశాలలు నడుస్తున్నాయని, పాఠాలు చెప్పకుండానే పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక విద్యార్థులకు అన్యాయం చేస్తూ సీట్లను ఇతర రాష్ట్రాల వారికి విక్రయిస్తున్నారని విమర్శించారు. ఎడ్‌సెట్ పూర్తికాకముందే అక్రమ అడ్మిషన్లు చేపడుతున్నారని, బిల్డింగ్స్, అధ్యాపకులు లేకపోయినా కళాశాలలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై వెంటనే స్పందించాలని వైవియు వీసీ బెల్లంకొండా రాజశేఖర్ ను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్