దసరా సెలవుల్లో ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కొండాపురం ఎస్సై ప్రతాప్ రెడ్డి శనివారం తెలిపారు. ఇండ్లకు తాళం వేసి వెళ్లేవారు విలువైన వస్తువులు, డబ్బు ఇంట్లో ఉంచవద్దని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇస్తే రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తామని తెలిపారు.