ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా ఈవెంట్స్ ఆధ్వర్యంలో జిల్లా కళాకారులు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (బాలు) 80వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, మిస్పా మీడియా అధినేత పద్మాకర్ రావు మాట్లాడుతూ, బాలు అనేక భాషల్లో పాడి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఆయన లేకపోవడం తీరని లోటని అన్నారు. ఏటా బాలు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న పొదిలి వెంకటేష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గాయకులు సతీష్, మామిడి బాబు మనోహర్, వై. శివశంకర్, డాక్టర్ ప్రసాద్ యనమల, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.