కడప నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను అధికారికంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కడప నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరంలోని అన్ని ప్రధాన సర్కిల్స్, రహదారుల్లో ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రజలను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.