పేదల హక్కుల కోసం పోరాడిన ఆప్ కి ఆవాజ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చాన్ బాషా ప్రథమ వర్ధంతి సభ సోమవారం కడపలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా మాట్లాడుతూ, గతేడాది జూన్ 1న చాన్ బాషాను ఆయన భార్య, అత్తమామలు, బామ్మర్దులు కలిసి దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారికి కఠిన శిక్ష పడాలని, చాన్ బాషా ఆశయాలను నెరవేరుస్తామని ఆయన అన్నారు.