ఈగల్ హంటర్ ఏజెన్సీపై సీఐటీయూ ఫిర్యాదు

2చూసినవారు
ఈగల్ హంటర్ ఏజెన్సీపై సీఐటీయూ ఫిర్యాదు
కడప నగరంలోని జీజీహెచ్, రిమ్స్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ కార్మికులకు ఈగల్ హంటర్ యాజమాన్యం సరైన వేతనాలు చెల్లించడం లేదని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. నెలకు రూ. 13,960 చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 12,100 మాత్రమే ఇస్తున్నారని, పీఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించడం లేదని తెలిపారు. ఈ విషయమై ఏజెన్సీపై చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్ రంగస్వామికి సీఐటీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్