గురువారం రాత్రి కొండాపురం మండలం లావనూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంట్లో నాగుపాము కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పాములు పట్టే నిపుణులు మధు సుధన్ రెడ్డి ఆధ్వర్యంలో పామును జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు.