జౌళి రంగ ఎగుమతులపై కలెక్టర్ కీలక సమీక్ష

8చూసినవారు
జౌళి రంగ ఎగుమతులపై కలెక్టర్ కీలక సమీక్ష
భారతీయ వస్త్ర రంగాన్ని ప్రపంచ మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిపేందుకు జిల్లాలో జౌళి ఉత్పత్తుల ఎగుమతులను భారీగా ప్రోత్సహించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా, కమిషనర్ రేఖారాణి నిర్వహించిన ‘టెక్స్‌టైల్స్ విజన్-2030’ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఈ సమీక్ష చేపట్టారు. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్