కడప మున్సిపల్ కమిషనర్ కె. రాకేష్ చంద్రం, పన్నుల వసూళ్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ బకాయిలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. నగర అభివృద్ధికి పౌరులు సకాలంలో పన్నులు చెల్లించాలని ఆయన కోరారు.