కడప జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కోసం నిర్మిస్తున్న స్మార్ట్ కిచెన్ షెడ్లను జూన్ 8 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పనులపై సమీక్షించిన ఆయన, నాణ్యమైన భోజనం కోసం జిల్లాలో అమలు చేస్తున్న విధానం రాష్ట్రానికే ఆదర్శమని సీఎం ప్రకటించడం గర్వకారణమన్నారు. బడి ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు.