మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న అన్ని పంటలకు రైతులకు నష్టపరిహారం అందించాలని కడప జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం కడపలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి, వరి, మొక్కజొన్న, శనగ, మిర్చి వంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. బాధిత రైతులకు తక్షణ సాయం అందించి, పంట నష్టాలను ప్రభుత్వం పూర్తిగా అంచనా వేయాలని ఆయన కోరారు.