నేరాల నియంత్రణ, మహిళా భద్రతే లక్ష్యం: కడప ఎస్పీ

22చూసినవారు
నేరాల నియంత్రణ, మహిళా భద్రతే లక్ష్యం: కడప ఎస్పీ
కడప జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రౌడీషీటర్లు, నేరస్థులపై నిఘా పెంచాలని, మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లను కఠినంగా అణచివేయాలని సూచించారు. మహిళా భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రోన్లతో నిఘా పెంచాలని, ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్