కడప శిల్పారామం కళావేదికపై మిస్పా మూవీ పద్మాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రాలతో విద్యార్థులు చేసిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వారి అద్భుతమైన అడుగుల స్టెప్పులకు కళావేదిక చప్పట్లతో మారుమోగింది. శిల్పారామం ఏఓ కృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా, విజయవంతంగా జరిగింది.