గడ్డి బజార్‌లో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు

9చూసినవారు
గడ్డి బజార్‌లో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు
కడప నగరంలోని గడ్డి బజార్‌లో వెలసిన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి (బాలాజీ గుడి) ఆలయంలో ధనుర్మాస వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా 26వ రోజు శనివారం ధనుర్మాస అధ్యాయనోత్సవం మరియు పుష్య శుద్ధ పూర్ణిమ పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు విజయ భట్టర్ స్వామివారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :