కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపుతోందని ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కన్వీనర్ కె. సుబ్బరాయుడు తెలిపారు. దీనిని నిరసిస్తూ జూన్ 9న కడప కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు ఆయన గురువారం కడపలోని తమ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేస్తూ వెల్లడించారు. ముడిచమురు ధరలు తగ్గినా ఆయిల్ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలంతా ఈ ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.