కడప మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర వేసవి తీవ్రత దృష్ట్యా ఈస్ట్, నార్త్ జోన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నీటి బాటిళ్లు, క్యాప్‌లు పంపిణీ చేశారు. నగర పరిశుభ్రతలో వారి సేవలు అమూల్యమని కొనియాడారు. అనంతరం 48వ డివిజన్ రామాంజనేయ నగర్‌లో డా. ప్రసాద్ ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్‌ను పరిశీలించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ టెర్రస్ గార్డెనింగ్ చేపట్టాలని పిలుపునిచ్చారు.