సంక్రాంతి పండుగ సందర్భంగా కడప జిల్లాలో కోడి పందాలు, జూదం, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగుతుందని, పందెం బరులకు స్థలం కేటాయించే యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా అక్రమ పందాలు జరిగితే వెంటనే డయల్-112 కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.