ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి: కలెక్టర్

1చూసినవారు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి: కలెక్టర్
కడప జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించి, ప్రోత్సహించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన డిఐఈపిసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి, విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయాలన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, జిల్లా ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్