ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథ రెడ్డి ప్రజలకు సూచించారు. సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇది మంచి అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమాచారం ఇవ్వడం ద్వారా బీట్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచుతారని, విలువైన వస్తువులను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని సూచించారు.