ఎర్రగుంట్ల(M) కొత్త గోపులాపురంలో గత నెల 30వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీరాములు కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు అంజలి అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని తరచూ వేధిస్తున్నాడన్న కక్షతో తండ్రి వెంకట రాముడు, మరికొంతమంది కలిసి విద్యుత్ తీగతో గొంతు బిగించి హత్య చేసినట్లు సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.