కడప నగరంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, సరైన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు సూచించారు.